TOC

This article is currently in the process of being translated into Telugu (~98% done).

Classes:

Introduction to C# classes

చాలా programming tutorials లలో, classes గురించిన చాలా సమాచారం తరువాత తెలుస్తుంది. అయినప్పటికీ, C# అనేది Object Oriented programming గురించి తెలిసిన తర్వాతే classes గురించి తెలుసుకోవాలి కాబట్టి, ఇప్పుడు చాలా ముఖ్యమైన features యొక్క ప్రాథమిక పరిచయాన్ని చూద్దాము.

ముందుగా, class అనేది సంబందిత methods మరియు variables ని ఒక group గా చేయబడేది. ఒక class ఈ అంశాలను వివరిస్తుంది మరియు చాలా సందర్భాలలో మీరు ఈ class యొక్క instance (copy) ని సృష్టించిన దానినే object గా చెబుతారు. ఈ object పై మీరు నిర్వచించిన methods మరియు variables ని ఉపయోగిస్తారు. వాస్తవానికి, మీ class కి కావలసినన్ని objects ని సృష్టించవచ్చు. Classes మరియు Object Oriented programming చాలా పెద్ద అంశం. మేము ఈ chapter లో మరియు రాబోవు chapters లో కొన్నింటిని cover చేస్తాము, కానీ అన్నింటిని కాదు.

C# లో ప్రతిదీ classes తోటే built చేయబడుతుంది కనుక Hello world chapter లో మొదటిసారిగా ఒక class ని use చేయటాన్ని చూసాము. మనం build చేసిన class తో Hello world example ని expand చేద్దాము.

using System;

namespace ConsoleApplication1
{
    class Program
    {
        static void Main(string[] args)
        {
            Car car;

            car = new Car("Red");
            Console.WriteLine(car.Describe());

            car = new Car("Green");
            Console.WriteLine(car.Describe());

            Console.ReadLine();

        }
    }

    class Car
    {
        private string color;

        public Car(string color)
        {
            this.color = color;
        }

        public string Describe()
        {
            return "This car is " + Color;
        }

        public string Color
        {
            get { return color; }
            set { color = value; }
        }
    }
}

ఇక్కడ చాలా క్రొత్త విషయాలు ఉన్నాయి, కానీ దాదాపు అన్ని ఈ tutorials లో గతంలో ఉపయోగించిన వాటిపై ఆధారపడి ఉన్నాయి. మీరు గమనిస్తే, మనం car అనే new class ని define చేశాము. మీరు సులువుగా అవగాహన చేసుకొనేందుకు దీనిని మన main application మాదిరిగానే ఒకే file లో declare చేయబడింది, అయితే, సాధారణంగా new classes ని వాటి స్వంత files లో define చేస్తారు. ఇందులో color గా పిలిచే variable ని declare చేయబడింది, దానిని use చేసి మన car ఏ color లో ఉందో చెప్పబడును. మనము దీన్నిprivate గా declare చేశాము, ఇది మంచి అలవాటు – class బయటి నుండి variables ని access చేయడం కొరకు property ని ఉపయోగించాలి. Color variable ని access చేసుకోటానికి Class చివరలో Color property ని define చేయబడింది.

అలా కాకుండా, మన Car Class ఒక constructor ని define చేసింది. ఇది ఒక parameter ని తీసుకుంటుంది, దానితో Car ని color తో initialize చేయటానికి అనుమతిస్తుంది. ఒక constructor మాత్రమే ఉన్నందున, color తో (instantiate) copy చేయబడింది. మన Car గురించి ఒక చక్కని message ని print చేయటానికి సృష్టించిన Describe() method అనుమతిస్తుంది. ఇది మనము అందించే message తో string ని తిరిగి ఇస్తుంది.

ఇప్పుడు, మన main application లో మన Car యొక్క variable ని declare చేద్దాము. ఆ తరువాత, మనము “Red” parameter తో దాని యొక్క object ని సృష్టిద్దాము. మన class లోని code ప్రకారం, దాని అర్ధం ఏమిటంటే, Car యొక్క color variable కి “Red” ని assign చేయబడుతుంది. దీన్ని పరీక్షించటానికి, మనము Describe() ని call చేస్తాము, మరియు ఒకే class కి అనేక instances ని ఎంత తేలికగా సృష్టించగలమో చూపించడానికి మరొక color తో మళ్ళీ చేద్దాము. మన మొదటి functional class ని సృష్టించి దాన్ని use చేశాము.

క్రింది chapters లో properties, constructors, మరియు visibility లాంటి concepts ని మరింత లోతుగా explain చేయబడును.


This article has been fully translated into the following languages: Is your preferred language not on the list? Click here to help us translate this article into your language!