TOC

This article is currently in the process of being translated into Telugu (~98% done).

Debugging:

Introduction to debugging

మీరు గతంలో చూచిన ప్రాథమికమైన "Hello world!" examples నుండి మీ code సంక్లిష్టత (complexity) స్థాయికి చేరుకుంది. అక్కడ దాన్ని కేవలం run చేయడంతో ఏమి జరుగుతుందో ఖచ్చితంగా తెలుసుకో లేరు. మీ application ని run చేస్తున్నప్పుడు దానికున్న ముసుగుని తొలగించటానికి మరియు ఏమి జరుగుతుందో చూసే కొన్ని black magic అవసరం ఉంది. Debugging అనేదే ఆ magic tool, దాని మూల పనితనాన్ని తెలుసుకొంటే, మీరు ఇది లేకుండా ఇంతకాలం ఎలా గడిపామోనని ఆశ్చర్యపోతారు. ప్రతి programmer ఈ tool ని తప్పకుండా అర్ధం చేసుకోవాలి, ఎందుకంటే ఇది లేకుండా (సంక్లిష్టమైన) complex code లోని తప్పులని (bugs) సవరించడం అసాధ్యం.

మంచి ప్రావీణ్యం కలిగిన programmer కూడా నేటికీ వినియోగించే సర్వ సాధారణమైన మూల విధానం debugging, కొన్ని సార్లు దానినే "print debugging" గా పిలుస్తారు. ఒక సాధారణ విధానంగా, మీ application లో ఎక్కడో ఒక చోట చాలా simple గా, మీ code లో ఎక్కడ ఉన్నారో, మీ variables లో ఏమి ఉందో చూపే text లేదా number ని print చేయటానికి అనుమతిస్తుంది. C# తో, console పై variables లోని content ని output గా ఇవ్వటానికి లేదా సాధారణ స్థితిని తెలిపే సందేశాన్ని print చేయటానికి Console.Write() method ని ఉపయోగిస్తారు. కొన్ని సార్లు అది సరిపోతుంది, కానీ మీరు Visual Studio లేదా Expression versions లాంటి IDE ని వినియోగిస్తున్నప్పుడు, మీ వద్ద బలమైన tools ఉన్నాయి, వాటి యొక్క మూల సూత్రాలను నేర్చుకొంటే వాటిలోని ప్రతి దాన్ని easy గా వినియోగించవచ్చు. రాబోవు రెండు chapters లో IDE లోని debugging చేసే ప్రాథమిక సూత్రాలు తెలుసుకొంటే మీరు మంచి బలమైన programmer గా తయారౌతారు.


This article has been fully translated into the following languages: Is your preferred language not on the list? Click here to help us translate this article into your language!